భట్టి విక్రమార్క మల్లు అనే నేను….

డిప్యూటీ సిఎంగా ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రిగా

రాజకీయచిత్రంలో అత్యున్నత స్థానం

17 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ప్రస్థానం

విజన్ ఉన్న నాయకుడిగా రాష్ట్రసమగ్రాభివృద్ధిపై ప్రజల ఆశలు

అన్నివర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు

అభివృద్ధి ప్రదాతగా భట్టి నిలిచిపోవాలని కోరుతున్న ప్రజలు.

సభలో వందమంది ఒకవైపు కౌరవుల్లా ఉన్నా పాండవులవలే ఐదుగురమే మిగిలినా ప్రజలకోసం పోరాడే ప్రశ్నించే గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీసీ…  ప్రజల ఓటు తో “అటు పాలించేవాడైనా కావాలి..” లేదా “ప్రశ్నించేందుకైనా ఉండాలే” తప్ప తలవంచేదిగా ఉండరాదన్న మాటలతూటాలు ప్రత్యర్ధుల బలహీనతలపై దాడితో, తన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి తన హామీ పత్రంతో జీవంపోసారు… ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది మీ ఆశీస్సులతో ఉన్నతపదవితో మీ ఆకాంక్షలు నెరవేర్చుతా, మధిరఅభివృద్ధికి కృషిచేస్తానన్న భరోసా కల్పించడం ద్వారా నాలుగోసారి ఎన్నికయ్యారు భట్టివిక్రమార్క. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గురువుగా, దైవంగా చెప్పుకునే ఈయన ఆయన ప్రజాసేవస్పూర్తితో ప్రజాసేవకు అంకితమయ్యానంటారు… అన్ని అర్హతలున్నా తన సామాజికతే అడ్డుగా అవరోధాలను ఎదుర్కొంటూ రాజకీయ పదవీ సోపానపటం లో CM కుర్చీకి ఒక్కఅడుగుదూరంలో నిలవడం నిజంగా ఆయన కృషికి అవరోధపుపరిక్షే… ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆలోచనలే ఆయుధంగా మధిర ప్రజల ఆశీస్సులు, అభిమానమే తన ఎదుగుదలకు మూలమని నమ్మే భట్టి విక్రమార్క తన ఆత్మ, ఊపిరి, పాలనాప్రతిభను, సంస్కారాన్ని నేర్పింది ప్రజలేనని పేర్కొనడం ఆయన నాయకత్వ విధేయతకు నిదర్శనం.

అంచెలంచెలుగా 40 ఏళ్ళు సుధీర్ఘరాజకీయ జీవితంలో ఎన్నో పదవులు నిర్వహించిన AICC అధినేతల ఆశీస్సులతో రాష్ట్రస్థాయినేతగా గుర్తింపుపొందారు. విద్యావంతునిగా, సౌమ్యునిగా రాజకీయచాణక్యునిగా కాంగ్రెస్ పార్టీలో ఉపముఖ్యమంత్రి పదవీతో గుర్తింపును పొందారు. మధిర చరిత్రలో 50 ఏళ్ల తర్వాత అమాత్యుని హోదాతో తనకంటూ ప్రజా ప్రతినిధిగా ఉన్నతశిఖరాన్ని పొందిన నాయకుడు భట్టివిక్రమార్క. అపర భగీరధుడిగా అభివృద్ధి ప్రదాతగా ఈ ప్రాంత ప్రజల మదిలో సుస్థిరమైన గుర్తింపు పొందిన ఆయన తనదైన మార్కు తో మరో మారు మధిర సమగ్రాభివృద్ధినీ కొనసాగిస్తారని, ఆకాంక్ష లను గుర్తుచేస్తూ మధిర ప్రజలు ఆయనకు అభినందనల విన్నపాలు చేస్తున్నారు.

విద్యార్థి దశ నుండి తన సోదరుడు మాజీ పిసిసి అధ్యక్షుడు  మల్లుఅనంతరాములు ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మల్లుభట్టివిక్రమార్కు ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్త నుండి పిసిసి కార్యదర్శిగా పార్టీ పదవుల్లో ఎదిగారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీకి విధేయునిగా ఉంటూ తన ప్రజాప్రతినిధిగా జీవితాన్ని అరంభించేందుకు అనేక ఒడిదొడుగులు ఎదుర్కొన్నారు. ఆంధ్ర బ్యాంకు బోర్డు డైరెక్టర్గా యువ నాయకుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన,స్వర్గీయ సిఎం డా.వైఎస్. రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో 2007లో ఎమ్మెల్సీ గా గెలిచి రెండేళ్ళు కొనసాగారు. ఈప్రాంతానికి ప్రాతినిధ్యంవహించి మంత్రిగా పనిచేసిన శీలం సిద్ధారెడ్డి తదనంతరం సుధీర్ఘకాలం కమ్యూనిష్టుల ఏలుబడిలో కొనసాగిన మధిరస్థానానికి, డిలిమిటేషన్ ప్రక్రియతో ఎస్సీ రిజర్వ్ కాబడిన మధిర స్థానానికి 2009లో శాసనసభ్యునిగా కాంగ్రెస్పోర్టీ టిక్కెట్ తో గెలుపొందారు. అప్పటినుండి 2014, 2018తోపాటు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. మధిర ప్రాంతం అభివృద్ధికి బాటలువేసిన నాయకునిగా, ఉమ్మడిరాష్ట్రప్రభుత్వంలో చీప్ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసారు.2014-18 మంతకాలంలో మరోమారు శాసనసభ్యులు ఎన్నికైన ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బలోపేతానికి శాసనసభలో పార్టీ సీఎల్పీ ఉప నాయకుడిగా పనిచేశారు. 3 వ సారి గెలిచిన ఆయన 2018-23 వరకు సిఎల్ పి నేత గా భాద్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి నాలుగవసారి మధిర నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లుభట్టివిక్రమార్క ఉపముఖ్యమంత్రిగా,ఆర్థిక, విద్యుత్ శాఖ ల మంత్రి గా బాధ్యతలను చేపట్టడం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో చీప్ విప్ గా కొంతకాలం, ఆతరువాత డిప్యూటీస్సీకర్ పనిచేసారు. తెలంగాణ ఉద్యమపోరులో ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా తెలంగాణ రాష్ట్రఏర్పాటుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టి అమోదింపచేసిన ఘనత భట్టిదే. ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించే ఈయన 2009లో తొలిసారి ప్రాతినిధ్యం వహించిన కాలంలో మధిర ప్రాంతానికి రూ. 1800కోట్లకు పైగా విధులతో రహదారులు, తాగునీటి, సాగునీటి వనరులు సద్వినియోగంపై దృష్టిసారించి ముడిట్లను నిర్మించారు. మున్నెరు. కట్టలేరు నదులపై చెక్ ఢ్యాo లను నిర్మించి, సుజల స్రవంతి తో ప్రజలకు తాగు రైతాంగానికి సాగునీటిని అందించి, రెండుపంటలను సాగుచేసుకునేదిశగా చర్యలు చేపట్టారు. పర్యాటకరంగాన్ని ఆదరించేలా మండల కేంద్రాల పరిధిలోని చెరువులను ఆధునికీకరించారు. నియోజవర్గాన్ని మధిరకేంద్రంతో అనుసంధానం చేస్తూ అంతరాష్ట్రరహదారుల విస్తరణకు కృషిచేసారు. అలాగే విద్యారంగాన్ని పటిష్టం చేసే క్రమంలో వ్యవసాయపాలిటెకి ప్రభుత్వ (సాంకేతిక) పాలిటెక్నిక్ు ఏర్పాటు చేయించారు. కెజి నుండి పీజీ వరకు విద్యారంగానికి ప్రభుత్వ ప్రయివేటు రంగాల్లో అవకాశాలను సుగమం చేసారు. మధిర సమగ్రాభివృద్ధి లక్ష్యంతో అడుగులేసిన ఆయనకు రాష్ట్ర ఏర్పాటు తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా, మదిర ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగం మినహా అన్ని రంగాల్లో మోడుబారిందని చెప్పవచ్చు. భట్టివిక్రమార్క రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనుందనుండడంతో 2009లో లాగే మరోమారు నిధులవర్షంతో ఈప్రాంతం సమగ్రాభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారమౌతాయన్న ఆశతో ప్రజలు ఉన్నారు. భట్టివిక్రమార్క ముందున్న నాటి ఖమ్మం అభివృద్ధి ఆలోచనల పరంపరలో రాష్ట్ర విభజనతో కుదేలైన విద్యా వర్తకవ్యాపార రంగాల పురోగతిపై దృష్టి సారించాలి.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here