హైదరాబాద్.17.02.2024: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కె.కేశవ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ మేరకు తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. 1000 మంది ఆటో డ్రైవర్లకు 1 లక్ష రూపాయల యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.

ఈ సందర్బంగా కేసీఆర్ గారిపై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here