డిల్లీ.05.04.2024 : దేశంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృషి సారించింది.

మరీ ముఖ్యంగా గత ఎన్నికలో తక్కువ శాతం పోలింగ్‌ నమోదవుతున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటోంది.

ఇక.. దేశవ్యాప్తంగా 50 పార్లమెంట్ నియోజకవర్గాలలో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్టు ఈసీ గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణలో తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణలో హైదరాబాద్(44), సికింద్రాబాద్(46), మల్కాజ్‌గిరి(49), చేవెళ్ల (53) స్థానాల్లో 2019లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యింది. దీంతో, ఈ నియోజకవర్గాలపై ఈసీ ఫోకస్‌ పెట్టింది.

మహానగరంలో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్లకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కల్పించాలని ఈసీ ఆదేశించారు. ఓటు హక్కు వినియోగంపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వివిధ కార్యక్రమాల పేరుతో ఓటర్లలో చైతన్యం పెంచాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here