లారీ డ్రైవర్లకు ఫ్రీ ఛాయ్‌.. ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం!

చాలావరకు రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణం అవుతుంటాయి! సరకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతున్నప్పుడు.. ఒక్కసారి రెప్పవాల్చినా సరే.. ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని నిర్ణయించింది.

హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది. ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్‌ ఇవ్వనున్నట్లు చెప్పింది. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లు టీ తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేలా కూడా హైవేల పక్కన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాటిలో నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here