భద్రాచలం.28.02.2024: భద్రాచలం అభివృద్ది గురించి మాట్లాడుతూ అదే విధంగా ప్రజా సేవ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని పేర్కొన్నారు.

మంగళవారం స్థానిక శ్రీనిధి రెసిడెన్సీ లో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి స్పిరుచువల్ స్పీచ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో బడికి వెళ్తున్న విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సద్గురు మధుసూదన్ సాయి ట్రస్ట్ వారు ప్రారంభించనున్నారని, దానికి 50 శాతం నిధులు ట్రస్ట్ సమకూరుస్తారని, మిగితా 50 శాతం నిధులు తెలంగాణ ప్రభుత్వం భరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆమె తెలిపారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది బాలలకు పౌష్టిక ఆహారం అందుతుందని తెలిపారు. భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రాభవం కోల్పోతుందని, భవిష్యత్లో దేశం మొత్తం చర్చించుకునేలా అభివృద్ధి చేస్తామని అన్నారు.సద్గురు మధుసూదన్ సాయి ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాలలో తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గ్లోబల్ హుమానిటేరియన్ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి తెలిపారు.

భద్రాద్రి రామయ్య దర్శనం సంతృప్తిని ఇచ్చిందని, భద్రాద్రి ఆలయ అభివృద్ధితో పాటు, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఇక్కడకు రావడం జరిగిందని అన్నారు. విద్య, వైద్యం, పౌష్టిక , ఆహారం అందించడమే ధ్యేయంగా బెంగళూరు కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 31 ఎడ్యుకేషన్ కేంద్రాలను స్థాపించి ఉచిత విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉచిత మెడికల్ కళాశాల స్థాపించిన ఘనత మా ట్రస్ట్ దేనని తెలిపారు. భద్రాద్రి అభివృద్ధికి తాను సహకరిస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here