భద్రాచలం.06.03.2024: తాను బి ఆర్ ఎస్ పార్టీని వీడటం లేదని, భద్రాచలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.

మంగళవారం భద్రాచలం మండలం బీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించుకొని భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించాలని సహృదయంతో ప్రజలందరూ తనకు ఓటేసి గెలిపించారని తెలిపారు.

భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం గత ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేకపోవడానికి కారణం ఆనాటి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సక్యత లేకపోవడమేనని తెలిపారు.

ప్రజలు అవసరాలు, అభివృద్ధి కోసం తాను ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి, మంత్రులను కలుస్తానని అన్నారు. పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

11 వ తారీకున ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఈ నియోజకవర్గ సమస్యలను అన్ని మండలాల నుంచి సమీకరించుకొని అందజేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల్ల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండిచెట్టి కృష్ణమూర్తి, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్యం సత్యనారాయణమూర్తి,భద్రాచలం మండల ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, జాయింట్ సెక్రెటరీ బాంబోతుల రాజీవ, మండల యూత్ అధ్యక్షులు గాడి విజయ్, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు సుక్క సుధాకర్, సీనియర్ నాయకులు తాళ్ల రవికుమార్, సునీల్, నక్కా ప్రసాద్ పెద్దినేని శ్రీనివాస్ ,గ్రంధాలయం మాజీ చైర్మన్ మామిడి పుల్లారావు, మహిళా నాయకులు, అన్ని వార్డుల ఇన్చార్జిలు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here