భద్రాచలం.06.03.2024: ఏ ఎస్ పి పరితోష్ పంకజ్, ఐ పి ఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం, కూనవరం రోడ్, ఏం వి ఐ ఆఫీస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ములుగు జిల్లా, మంగపేట మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బొబ్బ సూర్యప్రకాష్ మరియు భద్రాచలం, సీతారామనగర్ కాలనీకి చెందిన చిప్పల సత్యనారాయణ రాజు అను వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవుట ప్రయత్నిస్తుండగా అనుమానంవచ్చి వారిని పట్టుకొని తనదైన శైలిలో విచారించగా, భద్రాచలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ కార్యాలయము ముందు దొంగలించబడిన మోటార్ సైకిల్ మరియు చెర్ల రోడ్, కొత్త మార్కెట్ వద్ద దొంగలించబడిన మోటార్ సైకిళ్ళ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు.

దొంగతనానికి పాల్పడిన బొబ్బ సూర్యప్రకాష్ మరియు చిప్పల సత్యనారాయణ రాజు అను వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here