భద్రాచలం.19.04.2024 : భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్ లను వరంగల్ ఏ సి బి డి ఎస్ పి సాంబయ్య, సి ఐ లు శ్యాంసుందర్, మహేష్ లు గురువారం అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఎస్ ఐ కి కానిస్టేబుల్ కి మధ్యవర్తిగా పనిచేస్తూ, పలువురి వద్ద లంచాలు డిమాండ్ చేస్తున్న సీసీటీవీ టెక్నీషియన్ నవీన్ అనే ప్రైవేటు వ్యక్తిని కూడా అరెస్టు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక ప్రైవేటు గోడౌన్ నుంచి నాలుగు బస్తాల పంచదారను రాత్రి సమయంలో ఇరువురు వ్యక్తులు ఆటోలో దొంగతనంగా తరలించడం సిసి టీవీ కెమెరాలలో చూసిన కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు వ్యక్తి నవీన్ లు ఎస్సై శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్లారు.

ఆటోతోపాటు ఇద్దరు వ్యక్తులను స్టేషన్ కు తీసుకురావాల్సిందిగా ఎస్సై ఆదేశాల మేరకు, కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు వ్యక్తి నవీన్లు ఆటో తో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయకుండా కానిస్టేబుల్ శంకర్, సీసీటీవీ టెక్నీషియన్ నవీన్ లు వారితో బేరసారాలకు దిగారు. కేసు నమోదు చేయకుండా, ఆటోతో పాటు నాలుగు బస్తాల షుగర్ సెల్ ఫోన్ లను రిలీజ్ చేయాలంటే రూ. 30,000 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

అయితే అంత డబ్బులు ఇచ్చుకోలేమని బ్రతిమిలాడిన వినకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఖమ్మం ఏసీబీ అధికారులకు సమయం లేకపోవడంతో, ఈ కేసును వరంగల్ ఏసీబీ అధికారులకు అప్ప చెప్పారు. గురువారం వరంగల్ నుండి వచ్చిన ఏసీబీ అధికారులు డీఎస్పీ సాంబయ్య, సిఐలు శ్యాంసుందర్, మహేష్ లు ఫిర్యాదు చేసిన సాయి తేజ కు రూ 20000 ఇచ్చి పోలీస్ స్టేషన్ కు పంపారు. సీసీటీవీ రూమ్ లో కానిస్టేబుల్ శంకర్ రూ 20000 ఎస్ఐ ఆదేశాలు పొందిన తర్వాత తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

ఎస్సై శ్రీనివాసును, మధ్యవర్తిత్వం నడిపినందుకు సిసి కెమెరా టెక్నీషియన్ నవీన్ అనే ప్రైవేటు వ్యక్తిని ముగ్గురిని అరెస్టు చేసి ఖమ్మం ఎసిబి అధికారులకు అప్పజెప్పనున్నట్లు వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య విలేకరులకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here