భద్రాచలం.06.03.2024: పొదేం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న రాజీవ్ గాంధీ మూడవ అంతర్రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో మంగళవారం పర్ణశాల లెవెన్, పెస్టిసైడ్స్ లెవెన్, ఆర్ ఆర్ పి లెజెండ్స్ జట్లు విజయం సాధించాయి.

ముందుగా పెస్టిసైడ్స్ లెవెన్, నందన్ లెవెన్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 10 ఓవర్లలో పెస్టిసైడ్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఈ జట్టులోని గని 27 పరుగులు, రవి రాయల 24పరుగులు సాధించారు. నందన్ లెవెన్ జట్టు 10 ఓవర్లలో 7 వికట నష్టానికి 63 పరుగులు సాధించి ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గని ఎంపికయ్యాడు.

మరొక మ్యాచ్లో వంశీ రాయల్స్, పర్ణశాల లెవెన్ జట్టుతో తలపడింది. ముందుగా వంశీ రాయల్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేశారు. దానికి ప్రతిగా పర్ణశాల జట్టు 8 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసి విజయం సాధించారు. పర్ణశాల జట్టులోని శివ 15 పరుగులు, శివరాం రెండు వికెట్లు తీశారు. ఈ జట్టులోని శివకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

 వేరొక మ్యాచ్లో ఆర్ఆర్పి లెజెండ్స్, స్పైడర్ లెవెన్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆద్యంతం చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఆర్.ఆర్.పి లెజెండ్స్ జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ ఆర్ పి లెజెండ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు సాధించారు. 69 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పైడర్ లేవెన్ జట్టు చివరి వరకు పోరాడి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యారు.

 స్పైడర్ 11 జట్టులోని అక్షయ సాయి 27 పరుగులు దేవాన్ 11 పరుగులు సాధించారు.

ఆర్ ఆర్ పి జట్టులోని,నరసయ్య కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో పొలమూరి బసవరాజు, తెల్లం నరేష్, కాపుల శ్రీను(ఏసు), అలీం, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here