భద్రాచలం.06.02.2024: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మండల కమిటీ సమావేశంలో మండల అధ్యక్షులు, కార్యదర్శి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు దిష్టిబొమ్మ తగలబెట్టడం సిగ్గుమాలిన చర్య ఆని అన్నారు.

భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లo వెంకటరావు, కట్టుబడి ఉన్నారు. ఇది నచ్చని కాంగ్రెస్, టిడిపి నాయకులు మా ఎమ్మెల్యే మీద అవాకులు చావాకులు పేలడం అనేది మేం ఖండిస్తున్నాము.

కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అర్థరహితంగా ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి నిధుల కొరకు ముఖ్యమంత్రిని కలిస్తే ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి..

పొదెం వీరయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి, భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేనందువలన ప్రజలు తిరస్కరించి డాక్టర్ తెల్లం వెంకటరావు ని గెలిపించారు.

దాంట్లో భాగంగానే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం అభివృద్ధి కొరకై ముఖ్యమంత్రి ని స్థానిక మంత్రులను కలిసి భద్రాచలానికి నిధులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తప్ప, వాళ్ళు ఊహించిన రీతిగా ఏమీ లేదు…

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది కాంగ్రెస్ ,టిడిపి నాయకుల చర్యలు తప్ప, ఏమీ లేదు,వెంకట్రావు దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది వాళ్ళు ఇంగిత జ్ఞానానికి వదిలిపెడుతున్నాం కాబట్టి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతంగా కాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాం…

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, జాయింట్ సెక్రెటర బొంబోతుల రాజీవ్, పార్టీ మండల నాయకులు అంకుజు సునీల్, పెద్దినేని శ్రీనివాస్ , కోలా రాజు యూత్ మండల అధ్యక్షులు గాడి విజయ్ సెక్రటరీ ఆకుల వెంకట్ జాయింట్ సెక్రెటరీ పులగిరి నాగేందర్ చర్ల అధికార ప్రతినిధి కోటేరు శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here