భద్రాచలం,స్నాప్ న్యూస్ 14.10.2023 : భద్రాచలంలో కాంగ్రెస్ మరియు బి ఆర్ ఎస్ పార్టీల మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ప్రెస్ మీట్లు పెట్టి మరీ..అభ్యర్థులు పరస్పరం తిట్టుకుంటున్నారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య..పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇద్దరు  తిట్టుకున్నారు. పరస్పరం పరుష పదజాలంతో దూషించుకున్నారు.  వీరిద్దరి తిట్ల పర్వం మినీ యుద్ధాన్ని తలపించింది.

దసరా బుల్లోల్లు..గంగిరెద్దుల వాళ్లను నమ్మొద్దు – రేగా కాంతారావు

తెలంగాణ ఎన్నికల్లో  భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న తెల్లం వెంకట్రావును గెలిపించాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యపై ఘాటు విమర్శలు చేశారు. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడి ప్రజల బాగోగులను కూడా చూస్తానని రేగా కాంతారావు హామీ ఇచ్చారు. దసరా బుల్లోల్లు, సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దు  వాళ్ళను, వారి మాటలను ఈ ఎన్నికల్లో నమ్మకండి అంటూ ప్రజలను కోరారు. అలాంటి వారిని నమ్ముకోవడం వల్లనే భద్రాచలం అంధకారం అయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని..కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వెంటనే భద్రచలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

నోరు అదుపులో పెట్టుకో – పోదెం వీరయ్య

భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య నివాసం వద్ద నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను  రేగా కాంతారావు నీకు సిగ్గు, లజ్జ ఉంటే నన్ను గంగిరెద్దు అంటావా, నీకు లాగా డబ్బులకు అమ్ముడుపోయిన నాయకుణ్ణి కాదని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి డబ్బులకు అమ్ముడుపోయిన నువ్వు కూడా నాయకుడివేనా, మీ ముఖ్యమంత్రి చేత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి తలంబ్రాలు తీసుకురావడం చేతకాదని, భద్రాచలం కి నువ్వేం చేసావ్ చెప్పాలని, నన్ను సంక్రాంతి గంగిరెద్దు అంటావా ఖబడ్దార్ కాస్కో,రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తు పెట్టుకో అని, 5 గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని, భద్రాచలం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ఎన్నికల కోడ్ వచ్చిన రోజున కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటూ భద్రాచలం హడావుడి శంకుస్థాపనలతో భద్రాచలం ప్రజలను మభ్యపెట్ట వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సిగ్గు ఉండాలని, నువ్వు మంత్రి వని నీ ప్రాంత అభివృద్ధి చేస్తున్న కానీ భద్రాచలం ను మాత్రం పట్టించుకోలేదని, వరదల సమయంలో పట్టించుకోలేదని,తెల్లం వెంకట్రావు ఈ నియెజకవర్గంలో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నాడని, అయన ముఖ్యమంత్రి ని కలిసి ఎం అభివృద్ధి చేసాడని,భద్రాచలం లో ఉన్న హాస్పటల్ ను చూస్తూ పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారని రాజకీయాలపై అవగాహనా లేని తెల్లం వెంకట్రావు కు ఎలా ఓట్లు వేసి గెలిసిస్తారని ,10 సంవత్సరాలలో తెల్లం వెంకట్రావు ఎన్ని పార్టీ మారారో అందరికి తెలుసనీ భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య అన్నారు.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here