telangana elections

పోలింగ్ ఏజెంట్లే కీలకం!

సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ బంద్

అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి నేటితో తెరపడనుంది. సా.5 గంటలకు మైకులన్నీ మూగబోనున్నాయి. నెల రోజులుగా సుడిగాలి పర్యటనలు చేసిన అగ్ర నేతలు కాస్త రిలాక్స్ కానున్నారు. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా, ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్పై గ్రామ స్థాయి నేతలు దృష్టి సారించనున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మద్యం, మనీతో ప్రలోభాల పర్వం షురూ కానుంది. దీన్ని అడ్డుకోవడానికి EC అధికారులూ రంగంలోకి దిగనున్నారు.

పోలింగ్ ఏజెంట్లే కీలకం!

పోలింగ్ బూత్లో ఏజెంట్ల పాత్ర చాలా కీలకం.బోగస్ ఓట్లు పడకుండా ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాల్సింది వీరే. ఒక ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి విశ్వాసపాత్రులుగా ఉండాలి. లేకపోతే ఇతర అభ్యర్థులకి అమ్ముడుపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ప్రతి పోలింగ్ కేంద్రానికి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంటు, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు.

సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ బంద్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలమేరకు ఇవాళ సా.5 గంటల నుంచి 30న సా.5 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వైన్స్, బార్ల యజమానులకు అధికారులు ఆదేశాలిచ్చారు. కాగా, 30న పోలింగ్ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నేతలు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here