హైదరాబాద్.28.03.2024 : జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసు కుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షల ను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

అంతకుముందు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. రెండుసార్లు తేదీల్లో మార్పు లు చేసింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 బీఈ బీటెక్‌, పరీక్ష ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో నిర్వహించను న్నారు.

పేపర్‌ – 2 పరీక్ష ఏప్రిల్‌ 12 వ తేదీన నిర్వహించను న్నారు. పేపర్‌-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుండగా, పేపర్‌-2 పరీక్ష ఒకే షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. విద్యా ర్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను jeemain. ac.in వెబ్సైట్లో చూసుకో వచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here