• వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి
  • 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ
  • 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి

తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్‌-2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here