పాల్వంచ.22.12.2023: భద్రాచలం మరియు సారపాక మధ్య నిర్మించుచున్న రెండవ వంతెన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనిరెండవ వంతెన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచలంకి వచ్చినప్పుడు బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం పై అసంతృప్తి తో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా వచ్చే పిబ్రవరి కల్లా బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవ్వాలని ఆదేశించడం జరిగింది.

ఈ సమీక్షా సమావేశం తో భద్రాచలం బ్రిడ్జి పనులలో వేగం పుంజుకోనున్నాయి. వచ్చే పిభ్రవరి కల్లా ఈ నిర్మాణం పూర్తయితే కరకట్ట తో పాటు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినందుకు భద్రాచలం ప్రజల మనస్సులో తుమ్మల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పుకోవచ్చు.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here