భద్రాచలం.06.03.2024: బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పోదేం.వీరయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భద్రాచలం యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు చింతిరేల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యడారి ప్రదీప్ ఆద్వర్యం లో అంబేద్కర్ సెంటర్ లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దిష్టి బొమ్మను  దగ్ధం చేశారు.

డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నమని పోధేం వీరయ్య గారు గత ప్రభుత్వంలో ఎవరిని కలవకపోవడం వలన అభివృద్ధి జరగలేదని అనడం హాస్యపదంగా ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి భద్రాచలం నియోజకవర్గ సమస్యల గురించి అభివృద్ధి గురించి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన భద్రాచలం నీ పట్టించుకోని గత ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని.

అప్పుడున్న ముఖ్యమంత్రి కనీసం తన క్యాబినెట్ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి అని పొదెం. వీరయ్య గారు వెళ్లి ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలవలేదు అనడం కరెక్ట్ కాదని..

గత పది సంవత్సరాలు అధికారంలో ఉంది మీ టిఆర్ఎస్ ప్రభుత్వం అని నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మీరు గాని మీ ఎంపీలు గాని ఎమ్మెల్సీలు గాని జిల్లా ఇన్చార్జి మంత్రి పువ్వాడ అజయ్ గాని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గాని భద్రాచలం కి ఏమి అభివృద్ధి చేశారు మీరు చెప్పాలి ఎందుకు చేయలేదు కూడా చెప్పాలి అని అన్నారు.

అభివృద్ధి మీరు చేయకుండా భద్రాచలం నియోజకవర్గం పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నది అప్పటి మీ ప్రభుత్వం. మళ్లీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పోదేం.వీరయ్య గారు ఏమి చేయలేదు ఎవరిని కలవలేదు అని అనడాన్ని వ్యతిరేకిస్తున్నామని..

అధికారం పోయిన రెండు నెలలకే అధికార దాహం కోసం పాకులాడుతూన్న మిమ్మల్ని చూస్తూ మీ టిఆర్ఎస్ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు అని.

భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే మీరు మంత్రులను ముఖ్యమంత్రిని కలిస్తే ఏ నాయకుడిని మీతో పాటు ఎందుకు తీసుకొని వెళ్లలేదు అభివృద్ధి కోసం కలవాలి అని అనుకుంటే కుటుంబంతో ఎవరు కలవరని..

ఊసరవెల్లి లాగా పార్టీలు మారి రోజుకు ఒక జండా కప్పుకుని తిరిగే మిమ్మల్ని చూసి మీకు ఓట్లు వేసిన ప్రజలు నవ్వుకుంటున్నారని. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు జరగవని యూత్ కాంగ్రెస్ తరపున వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో  యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here