న్యూఢిల్లీ.17.03.2024 : లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది.

ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు హెచ్చరికలు చేశారు సీఈసీ. సోషల్ మీడియాలో ప్రచారం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ హెచ్చరించారు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 79 (3)(బీ) కింద సంక్రమించిన అధికారాలతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నకిలీ వార్తలను తొలగించేందుకు , నిఘా వుంచేందుకు ప్రతి రాష్ట్రంలోనూ నోడల్ అధికారులను నియమిస్తామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

నకిలీ వార్తలపై వేగవంతమైన చర్యల కోసం SOP విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నకిలీ వార్తలను నిర్ధారించుకోవడానికి ఎప్పటికప్పుడు ECI.Gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని రాజీవ్ కుమార్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here