రామగుండం.17.03.2024 : రాబోయే జనరల్ ఎన్నికల చట్టాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులకు రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) గారు ఎన్నికల శిక్షణ సమావేశం రామగుండము పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ …. రానున్న జనరల్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని దానికి అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సిపి అన్నారు.

📌 అధికారులంతా ఎన్నికల నియమావళి కి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, ఎన్నికల డ్యూటీ చేస్తున్నటువంటి అధికారులు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ లో గల అంశాలపై, ఎన్నికల బందోబస్తు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, సిబ్బంది మోహరింపు, కేంద్ర బలగాలతో సమన్వయo తదితర అన్ని అంశాలపై పోలీసు అధికారులకు స్పష్టత ఉండాలి అన్నారు దానికి అనుగుణంగా పోలీసు అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

📌రాబోయే ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళి పట్ల ఎటువంటి అవగాహనా రాహిత్యం లేకుండా, వారికి గల పలు సందేహాలను నివృత్తి చేసేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.

📌ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు.

📌క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాలకు గుర్తింపు పట్ల స్పష్టత ఉండాలని, ఎన్నికల నిర్వహణలో పోలీస్ పాత్ర భద్రత దళాల మోహరింపు నామినేషన్ దాఖల నుండి ప్రచారం పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా శాంతి భద్రతను పర్యవేక్షించాలి, ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు, ప్రత్యేక బందోబస్తు పై సూచనలు చేశారు.

📌సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గత ఎన్నికల్లో అమలు చేసిన గుడ్ ప్రాక్టీస్ ను అమలు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ముందే ఈ విధంగా అయినా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అన్నారు.

📌ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉత్తమ విధానాలు, పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.

📌గత ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్నవారు, రౌడీషీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితా సిద్ధం చేసుకోవాలి. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సంబంధిత అధికారుల ముందు బైండోవర్ చేయాలి.

📌ఎన్నికల సమయంలో జైలు నుండి బయటకు వచ్చిన వారి వివరాలు సేకరించాలి. ట్రబుల్ మంగర్స్ పై నిఘా ఉంచాలి వారిని పోలీస్ స్టేషన్ లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలి

📌సేన్సేసినల్ కేసులలో నిందితులు, కంమ్యునల్ ఆఫెండర్స్, గొడవలు సృష్టించే వారిని లా అండ్ ఆర్డర్ సమస్య కలింగించే వారిని గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. NBWs, మిగిలిన వారిని కూడా గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు.

📌 తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఆయుధ లైసెన్స్ కలిగిన వారి వద్ద నుండి ఆయుధాలను డిపాజిట్ చేపించాలని ఆదేశించారు.

📌ఎన్నికల సమయంలో నగదు, మద్యం అక్రమ రవాణా, అనుమానిత వాహనాల తనిఖీ, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రతా సంబంధిత అంశాలను సీపీ గారు తెలిపారు.
📌 రామగుండం కమిషనర్ పరిధిలోని ఈరోజు నుండి వారం రోజులపాటు పోలీస్ అధికారులకు తరువాత ASI, HC, PC లకు ఎన్నికల సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో రెండు జిల్లాలకు సంబంధించిన ఏసీపీలు సిఐలు, ఎలక్షన్ సెల్ సీఐ,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here