హైదరాబాద్.13.03.2024:  మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

కాగా ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో TSRTC కొత్తగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఎన్టీఆర్‌ మార్గ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం వద్ద 25 బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ సంవత్సరం ఆగస్టు వరకు మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.ఈ మెట్రో ఎలక్ట్రిక్ బస్సులకూ మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఇది చదవండి : వయసు నిర్ధారణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్లే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here