హైదరాబాద్.02.03.2024 : వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు మరో శుభవార్త లభించింది. వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు, కాలేజీలకు ఈ నెల 8, 9, 10 తేదీలలో సెలవులు ప్రకటించారు.

మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10) ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here