హైదరాబాద్.15.03.2024 : లోక్‌సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది.

ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.

కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here