సిద్దిపేట.08.03.2024 : పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి పథకం( Kalyan Lakshmi). నాడు కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.

శుక్రవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 59జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

గతంలో కేసీఆర్‌ ఎన్నికల హమీలలో ఈ పథకాలు లేకున్నా మానవీయ కోణంలో స్పందించి ఈ పథకాలను అమలు చేసారన్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here