పాల్వంచ.26.02.2024: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్‌ లెవల్‌ స్యాండ్‌ కమిటీ సమావేశంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా చేపట్టవలసిన చర్యలపై మైన్స్‌, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌, టిఎస్‌యండిసి, మున్సిపల్‌, పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌, రెవెన్యూ, అధికారులతో సమీక్షించి పలు ఆదేశాలు చేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గోదావరి, కిన్నెరసాని నదులకు సంబంధించి మండలాల్లో నిర్వహిచబడుచున్న జిల్లాలో గల ఇసుక రీచ్‌లలో ఇసుక లభ్యత, నిల్వలపై సంయుక్త తణిఖీలు చేసి శుక్రవారం నాటికి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ అధికారంలో ఆదేశించారు . పాత రీచ్ లతో పాటు ఇసుకలభ్యతను బట్టి కొత్త రీచ్ లో ఏర్పాటుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని ఆమె తెలిపారు. ఇసుక రీచ్ ల ద్వారా జిల్లాలో ఇసుక రవాణాకు ఇసుక ర్యాంపుల నుండి నియమ నిబంధనలకు అనుగుణంగా ఇసుకను విక్రయించాలన్నారు.

జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని, ఇసుక రీచ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాటి మానిటరింగ్ అధికారులు ప్రతిరోజు ఆదేశించారు. ఇసుక రిచ్ చేరుకోవడానికి ఒకే రహదారి ఉండేలా, క్రంచ్ ఏర్పాటు చేయాలన్నారు. రసీదు మరియు దానిపైన స్టాంపు ఉన్న వాహనాలు మాత్రమే రీచ్ లోకి అనుమతించేలాగా చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితులలో ఇసుక అక్రమ రవాణా జరుగరాదని, ఆ దిశగా పోలీసు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చెక్ పోస్ట్ వద్ద పటిష్టమైన నిఘా పెడుతూ రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలకు జరిమానా విధించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ రవీంద్రనాథ్, డీఎస్పీ రెహమాన్, కలెక్టరేట్ పరిపాలనాధికారి గన్య, ఇరిగేషన్ ఈ ఈ అర్జున్ రావు, ఏడి మైన్స్ అధికారి జై సింగ్, భూమి కొలతల శాఖ అధికారి కుసుమకుమారి, డిప్యూటీ పంచాయతీ అధికారి భద్రాచలం, గ్రౌండ్ వాటర్ ఎడి బాలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here