హైదారాబాద్.27.03.2024 :  కేసీఆర్‌ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఒక్కో నియోజకవర్గంలో 3 బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారట కేసీఆర్‌. లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దూకుడు వ్యవహరిస్తోంది.

ఈ నెల 30 వరకు లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కెసిఆర్

సమన్వయ సమావేశాలను పూర్తిచేసిన అనంతరం క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని ఎంపీ అభ్యర్థులను ఆదేశించారు కేసీఆర్. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలని యోచనలో కేసీఆర్ ఉన్నారట. కాగా…హైదరాబాద్ లోక్ సభ స్థానానికి కూడా భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు హైదరాబాద్ టికెట్‌ను ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

అన్నదాతల చెంతకు గులాబీ బాస్ కేసీఆర్ 

ముషంపల్లికి రాబోతున్న కేసీఆర్, ఎండిన పంటల పరిశీలన చేయడానికీ కేసీఆర్. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here