హైదారాబాద్.16.03.2024 : దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు పోలింగ్.

  • మొదటి దశ పోలింగ్ – ఏప్రిల్ 19
  • రెండవ దశ పోలింగ్ – ఏప్రిల్ 26
  • మూడవ దశ పోలింగ్ – మే 7
  • నాల్గవ దశ పోలింగ్ – మే 13
  • ఐదవ దశ పోలింగ్ – మే 20
  • ఆరవ దశ పోలింగ్ – మే 25
  • ఏడవ దశ పోలింగ్ – జూన్ 1
  • ఫలితాలు – జూన్ 4

అతి పెద్ద ప్రజాసామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగింది. లోక్ సభ ఎన్నికల 2024 కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.

అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.08 కోట్ల మంది కొత్త ఓటర్లను ఉన్నారని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారి జాబితా కూడా తమ వద్ద ఉందని చెప్పారు. ఏప్రిల్ 1 తరువాత వారిక ఓటు హక్కు ఇస్తామని తెలిపారు.కాశ్మీర్ కు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని రాజీవ్ కుమార్ అన్నారు. ప్రతీ ఎన్నికలు తమకు పాఠాన్ని నేర్పుతున్నాయని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పని చేస్తారని అన్నారు. దేశంలో 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ లో టాయిలెట్ సౌకర్యంతో పాటు మంచినీళ్లను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రతీ స్టేషన్ లో వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here