హైదరాబాద్.20.01.2024: ఇటీవల ఒక ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన విడుదల చేశారు…!!

నిజామాబాద్ పర్యటన సందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు ఫ్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా తీసుకుని బకాయిలు చెల్లించని వారిపై కటిన చర్యలు తీసుకుని,ఫాక్స్ సంఘాలను బలోపేతం చేయాలని, అంతే కాకుండా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా DCCB,PACS లలో నాన్ అగ్రికల్చర్ లోన్లు తీసుకుని తిరిగి చెల్లించని ఎగవేతదారుల నుండి బకాయిలను వసూలు చేయాలని మాత్రమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

కానీ కొన్ని పత్రికలు రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యయుతం కాదని హితవు పలికారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వలన రైతులలో భయాందోళనలు నెలకుంటాయని అన్నారు….దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని,ఇది రైతు ప్రభుత్వమని,రైతుల మేలుకోరే ప్రభుత్వమని,గత ప్రభుత్వం లాగా రైతులను మభ్యపెట్టి కాలం వెళ్లదీసే ప్రభుత్వం కాదని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు…..!

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here