న్యూఢిల్లీ.17.04.2024 : శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు.

“శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లనే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను చూశాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం” అని మోడి ఎక్స్‌లో అన్నారు.

“శ్రీరాముడు భారతీయ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు, సాధువులు, మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని నా పూర్తి నమ్మకం. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్‌ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు” అని మోడి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here