New ration cards

భద్రాచలం.12.12.2023: పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే రేషన్ కార్డులతో అనేక ప్రయోజనాలుంటాయి. అయితే.. గత ప్రభుత్వం దాదాపు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డ్ లు జారీ చేయలేదు. వేలాది మంది దరఖాస్తులు చేసినా, అవి అమోదానికి నోచుకోలేదు.

పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే రేషన్ కార్డులతో అనేక ప్రయోజనాలుంటాయి. అయితే.. గత ప్రభుత్వం దాదాపు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డ్ లు జారీ చేయలేదు. వేలాది మంది దరఖాస్తులు చేసినా, అవి అమోదానికి నోచుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు దీరింది.

ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెండు పథకాలను ప్రారంభించింది. అదే విధంగా రైతు బంధు కూడా ఈ  రోజు రైతుల ఖాతాలలో జమ చేసింది. త్వరలోనే మిగిలిన పథకాలను అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో పథకాల లబ్ధికి ప్రజల గుర్తింపుకు రేషన్ కార్డులు ప్రామాణికం కానున్నాయి. అందులో పేర్లున్న వారికే అవకాశాలుంటాయి. దీంతో తమకు కొత్త రేషన్ కార్డ్ ల జారీ, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

కొత్త పథకాల్లో కూడా రేషన్ కార్డు తప్పనిసరి:  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంచింది. ఇందిరమ్మ ఇళ్లు,గృహజ్యోతి, మహిళలకు ప్రతినెలా రూ.2,500, యువ వికాసం వంటి పథకాలను అమలు చేయనుంది.

ఈ పథకాలకు రేషన్ కార్డ్ లల్లో పేర్లు ఉంటే లబ్ధిదారుల ఎంపిక సులభతరం అవుతుందన్నది అని అధికారులు చెబుతున్న మాట. అయితే.. రేషన్ కార్డ్ లేకపోవడంతో ఇన్నేళ్లు పథకాల లబ్ధికి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఈ ప్రభుత్వమైనా కొత్త పథకాల లబ్ధి పొందాలంటే  రేషన్ కార్డ్లు అందించేలా ముందుగా చర్యలు చేపట్టాలనే వాదన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here