హైదరాబాద్.14.03.2024 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC లో 3,035 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.ఆర్టీసీలో గత పదేళ్లుగా కారుణ్య నియామకాలు కొత్తగా పోస్టుల భర్తీ లేకపోవడంతోపాటు. ఏటా పదవీ విరమణలతో ఖాళీలు భారీగా పెరిగాయి.

ఇప్పటికే తక్కువ సిబ్బంది ఉండటం వల్ల వారిపై పనిభారం పెరుగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్ ఏర్పడిన తర్వాత అమలులోకి వచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరిగింది.ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరుకుంది. ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది.

దీంతో అదనంగా పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఇలా..

డ్రైవర్‌ పోస్టులు: 2000

శ్రామిక్‌ పోస్టులు: 743

డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు: 114

డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు: 84

డీఎం/ఏటీఎం/మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు: 40

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు: 23

మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 14

సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) పోస్టులు: 11

అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 6

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here