చరిత్రే సాక్ష్యం…బాధ్యతగా ఓటేద్దాం

ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి.. వ్యక్తుల తలరాతలు మారాయి. దేశ భవిష్యత్తునూ నిర్దేశించాయి.. అందుకు గత చరిత్రలే నిదర్శనం.. ఈ నెల(నవంబరు) 30న వేసే ఆ ఒక్క ఓటు తన, దేశ భవిష్యత్తుకు మార్గదర్శనం కావచ్చు.. అందుకు నవ, అర్హత ఉన్న ప్రతి ఓటరు బాధ్యతగా ఓటేయ్యాలి. ప్రపంచంలో ఒక్క ఓటుతో సంభవించిన గెలుపోటములు, ఓటు విలువ గురించి…

విశ్వాస తీర్మానంలో ఓడిన వాజ్‌పేయీ

ఒక్క ఓటుతో భారత ప్రధాని వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోయింది. 1996లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కేవలం 16 రోజులే(మే 16 నుంచి జూన్‌ 1) ఆ పదవిలో ఉన్నారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంలో ఒక్క ఓటుతో ఓడిపోయారు.

ముగ్గురు అమెరికా అధ్యక్షులు

ఒకే ఒక్క ఓటుతో ముగ్గురు అమెరికా అధ్యక్షులుగా పదవిని అధిరోహించారు. అందులో థామస్‌ జాఫర్‌సన్‌(1801-1809), జాన్‌ ఆడమ్స్‌(1797-1801), రూథర్‌ఫర్డ్‌ బి.హేన్స్‌(1877-1881) అమెరికా అధ్యక్ష పదవులు చేపట్టారు.

ఒక్క ఓటు జాతీయ భాషగా హిందీ

స్వాతంత్య్రం కంటే ముందు నుంచి భారతదేశంలో 80 శాతానికి పైగా ప్రజలు హిందీ భాషను మాట్లాడేవారు ఉన్నారు. అధికారిక భాషగా ఆంగ్లం ఉండాలా, హిందీ ఉండాలా అని అప్పట్లో బహిరంగంగా ఎన్నికలు నిర్వహించారు. ఒక్క ఓటుతో హిందీ భాష నెగ్గడంతో 1949 సెప్టెంబరు 14న ఆ భాషను అధికారికంగా ప్రకటించారు. 1950లో దేవనాగరి లిపితో హిందీ భాషను భారతదేశం నిర్ణయించింది.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here