భద్రాద్రి కొత్తగూడెం : ఎన్నికల కోడ్‌తో వాహన తనిఖీల కారణంగా జనం అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష నుంచి రెండు లక్షల వరకూ తీసుకెళ్లే వారి వద్ద ఆధారాలు చూపాలంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిరు వ్యాపారులు రైతులు ఆధారాలు చూపలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో నోట్లు పంచే నేతలను వదిలి సామాన్యులను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వద్ద రూ.1,21,100 లభించాయి. మరో కారులో ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్నా రూ.3,40,000 లభించాయి. మొత్తం రూ. 4,61,100 నగదు ని ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి అశ్వారావుపేట పోలీసులు సీజ్ చేశారు.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here