భద్రాచలం.10.03.2024 : గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని బొమ్మను చూపించి ప్రజలను మాయ చేశాడని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు.

ఇందిరమ్మ అభయ హస్తం లో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, ఐదవ గ్యారెంటీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం సోమవారం

భద్రాచలం రామయ్య పాదాల సన్నిధిలో ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు కేటాయుంచడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.

మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో స్థలం ఉన్న వారికి 3,500 ఇండ్లు గ్రామ సభల ద్వారా మంజూరు చేయడం జరుగుతుందని, రెండవ విడత స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి గిరిజనులు, దళితులకు రూ.6 లక్షలు, ఇతరులకు రు.5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జెడ్పీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు, మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, కలెక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here