• పోదెం వీరయ్య చేతుల మీదుగా ప్రారంభం
  • మొదటి బహుమతిగా 50000

భద్రాచలం.02.03.2024: భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.

మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం,వీరయ్య యువసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 50,000/-, రెండో బహుమతిగా 25,000/-, మ్యాన్ ఆఫ్ ది సీరియస్ గా 5,000/- రూపాయలను ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వనున్నట్లు వారు తెలియజేశారు.ఈ టోర్నమెంట్ను నేడు మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య లాంచనంగా ప్రారంభించనున్నారు. టెన్నిస్ బాల్ తో జరగనున్న ఈ మ్యాచ్లు ప్రతి మ్యాచ్ నిర్ణీత 10 ఓవర్లు మాత్రమే జరుగునని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో

టోర్నమెంట్ వ్యవస్థాపకులు పొలమూరి బసవరాజ్, కాపుల శ్రీను, అలీం, మణి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here