హైదరాబాద్.11.12.2023:ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టిన ముఖ్యమంత్రి.. అందులో రెండు గ్యారంటీలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు నిలిచిపోయిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలన్నారు.

సోమవారం వ్యవసాయ శాఖపై డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నేటి నుంచే రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా  పంట పెట్టుబడి సహాయం అందించాలన్నారు. అదేవిధంగా రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here