విశాఖ.17.03.2024 : రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు..

విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోలవరం ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే నాయకుడు లేకే ఏపీని మోడీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గత పాలకులు ఢిల్లీని గట్టిగా అడిగి హక్కులను సాధించుకునేవారని గుర్తు చేశారు. ఢిల్లీ శాసించి డిమాండ్లు నెరవేర్చుకునే నాయకులు ప్రస్తుతం ఏపీలో లేరని చురకలు అంటించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్సార్ బిడ్డ ముందుకొచ్చారని తెలిపారు. వైఎస్ సంకల్పం నిలబెట్టేవారే వైఎస్ వారసులు అవుతారని తెలిపారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయిన వారు వారుసులు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లమందరం అడ్డుకుందామన్నారు.

హక్కుల విషయంలో తెలుగువారమంతా ఒక్కటవుదామని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here