హైదరాబాద్.25.02.2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు..

తాజాగా ఆదివారం విద్యార్థులే తమ హాల్టికెట్లను నేరుగా పొందేలా అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.

ఇక ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండిలా..:

ప్రథమ ఇంటర్ విద్యార్థులైతే ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లు పొందొచ్చు.

ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: Click Here

ద్వితీయ ఇంటర్ విద్యార్థులైతే రోల్ నంబరు, గత ఏడాది హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి పొందొచ్చు.

సెకండ్ ఇయర్ హాల్టికెట్ల డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: Click Here

బ్రిడ్జి కోర్సు విద్యార్థులైతే ఎస్ఎస్సీ పరీక్ష నంబరు, రోల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రిడ్జి కోర్సు హాల్టికెట్ల డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి: Click Here

 

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలు:

ఫిబ్రవరి 28 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)

మార్చి 4 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)

మార్చి 6 – మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1

మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1

మార్చి 13 – కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1

మార్చి 15 – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)

మార్చి 18 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీలు:

ఫిబ్రవరి 29 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)

మార్చి 2 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)

మార్చి 5 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)

మార్చి 7 – మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2

మార్చి 12 – ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2

మార్చి 14 – కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2

మార్చి 16 – పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)

మార్చి 19 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here