2023 వ సంవత్సరానికి బైబై చెప్పడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ సంవత్సరం చివరి తేదీ చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా?

2023 వ సంవత్సరానికి బైబై చెప్పి 2024 కి వెల్కం చెప్పడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ఏడాది చివరి తేదీని గమనించారా? 12/31/23.. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెల, తేదీ, సంవత్సరం వరుసగా గమనిస్తే 123123 అని కనిపిస్తుంది. ఈ నంబర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. 123 అనే అంకెలు న్యూమరాలజీ ప్రకారం కొత్త ప్రారంభానికి సూచనగా చెప్తారు. 123 ఈ వరుస క్రమ సంఖ్యలని దేవతల సంఖ్యలుగా చెబుతారు. ఇవి విశ్వం నుండి సందేశం పంపినట్లుగా జనం నమ్ముతారు.

న్యూమరాలజీ ప్రకారం ప్రతి నంబర్‌కి నిర్ధిష్టమైన అర్ధం ఉంటుంది. 123 లోని ప్రతిసంఖ్యకు ఎలాంటి అర్ధం నిర్వచించారో తెలుసుకుందాం. నంబర్ 1 ఎప్పుడూ కొత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది. నంబర్ 2 భావోద్వేగాలను, ఆనందకరమైన సమయాన్ని చెబుతుంది. నంబర్ 3 ఈ సంఖ్య ఏదైనా నేర్చుకోవడం లేదా ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 123 ని కలిపి చూస్తే (1+2+3) ఇది 6 కి సమానం. 6 సమతుల్యత, ప్రేమలను సూచిస్తుంది. కాబట్టి 12/31/23 తేదీలో సానుకూలమైన అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక న్యూమరాలజీ ప్రకారం మొదట 12 స్థిరమైన శక్తికి నిదర్శనం. 31 విషయం అనుకున్నట్లుగా జరగట్లేదు అనే అర్ధాన్ని సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలని అర్ధం. 23 స్థిరమైన శక్తికి సంబంధించినది.

2023 వ సంవత్సరం నుండి 2024 సంవత్సరానికి మారుతున్న సందర్భంలో రెండు సంవత్సరాలకు కూడా అర్ధం ఉంది. 2023 సత్యాన్ని సూచిస్తుంది. 2024 శక్తి, మరియు ప్రకాశాన్ని సూచిస్తుంది. ఇవన్నీ న్యూమరాలజీ ప్రకారం చెప్పబడినవి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది తరుణం కాబట్టి ఈ తేదీని అందరూ శుభసూచకంగా భావిస్తున్నారు. ఈ తేదీకి సంబంధించిన వీడియోలు, న్యూస్, మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here