తిరుపతి.జనవరి.12.2024: ఏప్రిల్‌ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్‌ టికెట్ల కోటా షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం విడుదల చేసింది.

ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల తదితర ఆర్జిత సేవల లకీడిప్‌ కోసం నమోదుకు అవకాశం కల్పించింది.

22న మధ్యాహ్నం 3 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌ బ్రేక్‌ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు రూ.300 దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here