హైదరాబాద్.03.03.2024 : దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు నుండి జరగనుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ ఈ రోజు నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది.

పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లను (మొబైల్ , నాన్-మొబైల్) ఏర్పాటు చేశారు పిల్లలకు. ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ని అందించడానికి వాలంటీర్లకు శిక్షణనిస్తున్నారు.

తల్లిదండ్రులు తప్పకుండా ఈ రోజు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. ఎన్ని పనులున్నాబాధ్యాతయుతంగా పిల్లలను దగ్గర్లోని కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కలు వేయించాలి. జిల్లాల్లో తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఒక వేళ ఈ రోజున మర్చిపోతే నాలుగు,ఐదు తేదీల్లో ఆయా గ్రామాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు.

పోలియో వ్యాధి చిన్న పిల్లలకు రావడం, తరచూ జ్వరాలు రావడం అది మెదడుకు పాకి ఇబ్బందికరంగా మారడం జరుగుతుంటాయి. నరాల బలహీనత ఏర్పడుతుంది. ఈ పోలియో వ్యాది నివారణకు టీకా తప్పా మరొకటి లేకపోవడంతో పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని డాక్టరల్లు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here