మహిళలకు ఉచిత ప్రయాణం ఎఫెక్ట్…

తెలంగాణలో కొత్త సర్కారు తీసుకొచ్చిన మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ వస్తుండగా.. దాని ప్రభావం టీఎస్ ఆర్టీసీపై పడింది. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆర్టీసీ పరిధిలో నడుస్తున్న అన్ని బస్సుల్లో దాదాపు వంద శాతం ఆక్యుపెన్సీ ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే.. పథకం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ఆయా రూట్లలో చాలినన్ని బస్సులు లేకపోవటంతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్ బోర్డింగ్‌తో పాటు, వెనక ఉన్న నిచ్చెనపై నిలబడి ప్రయాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో బస్సులు సరిపోవడం లేదని టీఎస్ ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

ఈ ఫిర్యాదుల మీద స్పందించిన టీఎస్‌ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ప్రకటనలు విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వాళ్లు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్‌, సిటీ మఫిసిల్‌ బస్సులు కావాలని ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో (https://www.tsrtc.telangana.gov.in/) లేదా మొబైల్‌ నెంబర్‌: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్‌ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here