తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్.

నీటి సరఫరా చేసే ఉద్యోగి

కూల్చారం మండలoలోని, పైతరా గ్రామంలో నీటి సరఫరా చేసే ఉద్యోగి బట్ట జీవయ్య ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాజకీయ పార్టీలో చేరి ప్రచారం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేశారని C- విజిల్ యాప్ లో ఫిర్యాదు అందింది. వచ్చిన ఫిర్యాదుపై ఉన్నత శాఖల అధికారులు విచారణ చేయగా విచారణలో వచ్చిన ఫిర్యాదు నిజమేనని తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పశు సంవర్ధక శాఖలోని అటెండర్

మసాయిపేటలోని పశు సంవర్ధక శాఖలోని ప్రాథమిక కేంద్రంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కె. విద్య సాగర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా గ్రామంలో రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారంలో కండువాతో ప్రచారం చేశారని, వీడియో రికార్డ్ తో ఫిర్యాదు చేశారు. వివిధ శాఖ అధికారులతో నిర్ధారణ చేయగా, నిర్ధారణలో ఎన్నికల నియమావళి 2023 నియమావళి ఉల్లంఘించినట్లు రుజువైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ ప్రచారాలలో పాల్గొనకూడదని, ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే సీసీఏ రూల్, ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవలసివస్తుందని బుదవారం కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

భద్రాద్రి జిల్లాలో…

అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు హాజరు కానందున ఒక పిఓను, అయిదు ఓపిఓలను సస్పెండ్ చేసిన పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతిక్ జైన్.

Abdul Nayeem
Author: Abdul Nayeem

Sub editor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here