భద్రాచలం.23.12.2023: మూడు కోట్ల మంది దేవతలతో వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం ఇస్తారని అందరి నమ్మకం. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని అందుకే స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు.

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దక్షణ అయోధ్య భద్రాచలంకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం మధ్యాహ్నానికే భక్తుల రాకతో భద్రాచలం కిక్కిరిసింది.

భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆరుగంటల వరకు ఉత్తరద్వార దర్శనం కొనసాగింది. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు.

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here