హైదరాబాద్.19.01.2024: కేవలం శ్రమశక్తి పై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ప్రతి నెల ఆటో డ్రైవర్ల కు రూ. 12 వేలు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అఖిల భారత సంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు కేకేసీ చైర్మన్ కౌశల్ అమీర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రాన్ని అంద జేసింది.

ఈ సందర్భంగా కౌశల్ సమీర్ మాట్లాడుతూ… బైక్ ట్యాక్సీవాలను రద్దు చేయాలని, ట్రాన్స్ పోర్టు వ్యవస్థలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇప్పటికే తమ సమస్యలను పలుమార్లు మంత్రికి విన్నవించడం జరిగిందన్నారు.

తమ సమస్యలను క్షుణంగా పరిశీలించిన అనంతరం మంత్రి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌కు తగు సూచనలు చేయడం జరిగిందన్నారు.

మంత్రిని కలిసిన వారిలో కేకేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి, ఆటో విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష మల్లేష్, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు..

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here